Namaste NRI

తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

కెనడాలోని తెలంగాణ కెనడా అసోసియేషన్ (టీసీఏ) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఓక్విల్లోని కన్వెన్షన్ సెంటర్లో తెలంగాణ కెనడా అసోసియేషన్ అధ్యక్షుడు ఈద రాజేశ్వర్ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రూపొందించిన ఆరు అడుగుల ఎత్తున బతుకమ్మ చూపరులను ఆకట్టుకుంది. మహిళలు, చిన్నారులు బతుకమ్మ ఆడారు. నిమజ్జనం అనంతరం సత్తుపిండి, నువ్వులపిండి పల్లీ పిండి ప్రసాదాలను పంపిణీ చేశారు. పలు వంటకాలతో భోజన ఏర్పాట్లు చేశారు. వేడుకల నిర్వహణకు సహకరించిన శ్రీనివాస్ పబ్బ, శ్వేతా పుల్లూరి, ప్రశాంత్ మూల, మనస్విని వేళపాటి, రికెల్ హుంగేను, ఈద రాజేశ్వర్ అభినందించి జ్జాపికలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో బోర్డు ఆఫ్ ట్రస్టీ చైర్మన్ సంతోష్ గజవాడ, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ మన్నెం, దామోదర్ రెడ్డి మాది, శ్రీనాథ్ కుందూరి, శ్రీనివాస్ తిరునగరి, ప్రభాకర్ కంబాలపల్లి, దేవందర్ రెడ్డి గుజ్జుల, కోటేశ్వరరావు చిత్తలూరి, మనోజ్ రెడ్డి, ప్రకాష్ చిట్యాల, రాజేష్ ఆర్రా, శ్రీనివాస్ రెడ్డి దేప, ధాత్రి అంబటి, రాహుల్ బాలినేని, ఉదయ్ భాస్కర్ గుగ్గిళ్ళ, గిరిధర్ క్రోవిడి, దీప గజవాడ, నవీన్ ఆకుల తదితరులు పాల్గొన్నారు. బతుకమ్మ వేడుకల్లో సుమారు 1200 మందికి పైగా పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events