తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా Telugu Alliances of Canada (TACA) ఆధ్వర్యంలో 05 అక్టోబరు 2024 శనివారం రోజున కెనడా దేశం గ్రేటర్ టోరొంటో లోని బ్రాంప్టన్ నగరం సాండల్ వుడ్ పార్క్ వే సెకండరి స్కూల్ ఆడిటోరియంలో 1000 వేయి మందికి పైగా ప్రవాస తెలుగు వాసులు పాల్గొని బతుకమ్మ ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు. మహిళలు సాంప్ర దాయ దుస్తులతో బతుకమ్మ ఆటలు ఆడుతు పాటలు పాడుకొన్నారు.
ఉత్తమ బతుకమ్మ బహుమతి ని శ్రీమతి గౌతమి కొండబత్తిని, శ్రీమతి మౌణిక మరం,శ్రీమతి సౌజన్య కొంపల్లి, శ్రీమతి దివ్య ఆడెపు మరియు శ్రీమతి మౌణిక కందకట్ల గారలు గెలుచుకొన్నారు. పండుగ మొదటినుండి ఆఖరు వరకు ప్రముఖ గాయకురాలు శ్రీమతి పారిజాత గారి లైవ్ బతుకమ్మ పాటలతో ప్రత్యేక ఆకర్శనగా ఎంతో ఉత్సాహంగా జరిగాయి.
ఈ సందర్భంగా TACA ఆద్వర్యంలో మంచి రుచికరమైన భొజనాలు ఏర్పాటు చేసారు. ఈ పండుగ సంబురాలు TACA అధ్యక్షులు శ్రీ రమేశ్ మునుకుంట్ల గారి ఆధ్వర్యంలో జరుగగా ఉపాధ్యక్షులు శ్రీ రాఘవ్ కుమార్ అల్లం, కార్యదర్శి శ్రీ ప్రసన్న కుమార్ తిరుచిరాపల్లి, సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి అనిత సజ్జ ,కోషాధికారి శ్రీ మల్లిఖార్జునాచారి పదిర, సాంస్కృతిక సమన్వయ కర్త శ్రీ సంతోష్ కొంపల్లి డైరక్టర్లు శ్రీ ప్రదీప్ కుమార్ రెడ్డి ఏలూరు, శ్రీ దుర్గా ఆదిత్యవర్మ భూపతిరాజు, కుమారి విద్య భవణం, ఖజిల్ మొహమ్మద్ యూత్ డైరక్టరు శ్రీమతి లిఖిత యార్లగడ్డ, శ్రీ యస్వంత్ తేజ కర్రి, ఎక్స్ అఫిసియో సభ్యురాలు శ్రీమతి కల్పన మోటూరి, ఫౌండెషన్ కమీటీ చైర్మన్ శ్రీ అరుణ్ కుమార్ లాయం, ట్రస్టీబోర్డు చైర్మన్ శ్రీ సురేశ్ కూన, ట్రస్టీలు శ్రీ విద్యాసాగర్ రెడ్డి సారబుడ్ల, శ్రీమతి శృతి ఏలూరి, శ్రీమతి వాణి జయంతి మరియు ఫౌండర్లు శ్రీ హనుమంతాచారి సామంతపుడి, శ్రీనాథ్ కుందూరి, మునాఫ్ అబ్దుల్ గారలు పాల్గొన్నారు.
బతుకమ్మలను ప్రక్కనేగల హంబర్ నదిలో నిమజ్జనం చేసి సాంప్రదాయ బద్దంగా తయారు చేసుకొని వచ్చిన ఫలహారాలను ఆరగించారు. మహిళలు గౌరమ్మ పసుపు కుంకుమలను పంచుకున్నారు. ఆఖరుగా అధ్యక్షులు శ్రీ రమేశ్ మునుకుంట్ల గారు బతుకమ్మ పండుగలో పాల్గొన్న తెలుగు వారందరికీ, వలంటీర్లకు మరియు ఈ దిగ్విజయములో సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియచేస్తూ వచ్చే నెల నవంబరు 2 న జరిగే దీపావళి పండుగలో తెలుగు వారందరూ పాల్గొనవలసినదిగా కోరుతూ ఈ సంవత్సరము బతుకమ్మ పండుగ వేడుకలను ముగించారు.