Skip to main content

Namaste NRI

TCSS (సింగపూర్)ఆధ్వర్యంలో ఘనంగా బోనాల జాతర 2026

‘తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)’ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగ వేడుకలు ఆదివారం (9 ఆగస్టు 2026) సాయంత్రం అత్యంత వైభవంగా కోలాహలంగ జరిగాయి. ఈ బోనాల వేడుకలను స్థానిక ‘సుంగే కేడుట్‌’ లోని శ్రీ అరసకేసరి శివాలయంలో ఘనంగా జరుపుకున్నారు.

ఈ బోనాల ఊరేగింపులో పోతురాజులు, పులి వేషాలు, తొట్టెలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకల్లో సింగపూర్‌లో ఉన్న తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే కాకుండా.. తెలుగు వారందరితో తో కలిపి సుమారు 850 నుండి 900 మంది వరకు భక్తులు పాల్గొన్నారు. బోనాల ఊరేగింపులో అమ్మ వారి భక్తి మరియు బోనాలకు సంబందించిన ప్రత్యేక పాటలకు చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి ఆడిపాడారు. తెలంగాణ మహిళలు భక్తి శ్రద్ధలతో దుర్గాదేవికి బోనాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ప్రజలందరికి మహంకాళి తల్లి ఆశీస్సులు ఉండాలని టీసీఎస్‌ఎస్‌ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. మన ఈ తెలంగాణ సంప్రదాయం లో ప్రధాన భూమిక పోషించే బోనాల పండుగతో ప్రేరణ పొంది తెలుగు వారందరు బోనాల వేడుకను జరుపుకోవడం సంతోషకరం అని బోనాల్లో పాల్గొన్న వారు అన్నారు.

బోనాల జాతరలో పోతురాజు మరియు పులివేషాలతో జాతరకు కళ తెచ్చిన నేరెళ్ల శ్రీనాథ్, గౌడ సాయి కుమార్, అయిట్ల లక్ష్మణ్, లక్ష్మిపతి మరియు అరవింద్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.

ఈ ఏడాది బోనం సమర్పించిన ఫ్యామిలీస్ లో శశిధర్ రెడ్డి, రమేష్ గడప, అలేఖ్య దార, అలేఖ్య తడిసిన, దీపా రెడ్డి మండల, బోయిని స్వరూప, శ్వేత కుంభం, బర్ల అరుణ్‌కుమార్, బైలపూడి గౌరీ వరలక్ష్మి, మోతె శ్రీనివాస రెడ్డి, బొందుగుల ఉమారాణి మరియు అన్ను సుజాత ఉన్నారు. బోనం సమర్పించిన భక్తులకు తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వారు రిటర్న్ గిఫ్ట్ ను అందచేశారు. అమ్మవారికి బోనం సమర్పించిన భక్తులు ఇంట్లో వండి తెచ్చిన అన్న తీర్థ ప్రసాదాన్ని పంచి సంతోషాన్ని వెలిబుచ్చారు. వీరితో పాటు గడప రమేశ్ మరియు బసిక ప్రశాంత్ కుమార్ అమ్మవారి కోసం తొట్టెలను స్వయంగా పేర్చి తీసుకుకొచ్చారు.

బోనాలు పండుగ లో పాల్గొన్న భక్తులందరూ కమిటీ ఏర్పాటు చేసిన అన్న ప్రసాద (పులిహోర , పెరుగు అన్నం మరియు కేసరి ) వితరణలో పెద్ద ఎత్తులో సంతోషంగా పాల్గొని అందరూ అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.

సింగపూర్ బోనాలు – 2026 పండుగలో పాల్గొని విజయవంతం చేసిన మరియు ఎల్లప్పుడూ సొసైటీ వెన్నంటే ఉండి సహకారం అందిస్తున్న ప్రతీ ఒక్కరికి సొసైటీ అధ్యక్షులు నల్ల భాస్కర్ గుప్త, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి శెశిధర్ రెడ్డి ఎర్రమరెడ్డి, ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, జూలూరి సంతోష్ కుమార్, మిర్యాల సునీత రెడ్డి, సంతోష్ వర్మ మాదారపు మరియు విక్రమ్ చిట్ల సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, మహేష్ చెట్టిపెల్లి, కల్వ లక్ష్మణ్ రాజు మరియు శివ ప్రసాద్ ఆవుల మరియు కార్యవర్గ సభ్యులు బొడ్ల రోజా రమణి, రవి కృష్ణ విజ్జాపూర్, పెరుకు శివ రామ్ ప్రసాద్, విజయ మోహన్ వెంగళ, సతీష్ పెసరు, చల్లా క్రిష్ణ, మణికంఠ రెడ్డి, భాస్కర్ రావు పులిగిళ్ల, ప్రవీణ్ మామిడాల, తోట రాజేంద్ర ప్రసాద్ , యసరావేణి విజయ కుమార్, మల్లారెడ్డి కల్లెం మరియు సుకేందర్ నీలం మొదలగు వారు మాట్లాడుతూ సొసైటీకి సహాయ సహకారాలు అందిస్తున్న సింగపూర్ లో ఉన్న తెలంగాణ వాసులకు, అందరూ తెలుగు వారికి మరియు స్పాన్సర్స్ కు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు.అందరి పై ఉజ్జయిని మహంకాళీ ఆశీస్సులు ఉండాలని సొసైటి సభ్యులు ఆకాంక్షించారు.

ఎలాంటి అసౌకర్యం లేకుండ తీసుకున్న జాగ్రత్తలకు సొసైటీ చేసిన ఏర్పాట్లను భక్తులు అభినందించారు.ఈ వేడుకలకు సహకారం అందించిన మై హోమ్ బిల్డర్స్, కుమార్ ప్రాపర్టీస్ (ప్రాప్నెక్స్) సింగపూర్, ASBL కన్స్ట్రక్షన్ కంపెనీ, సరిగమ గ్రాండ్ ఇండియన్ రెస్టారెంట్, వజ్రా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ, ఏపీజే అభిరామి, ఏపీజే జువెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎవోల్వ్, ఏ వి ఏం కన్స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, విజయ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ (కూల్ టైమ్ ఎయిర్‌కాన్ ఇన్‌స్టాలేషన్ & సర్వీస్) మరియు స్వాతి ఖానాపురం; సాయి కృష్ణ కొమాకుల; నగేష్ టేకూరి; నిఖిల్ పారుపల్లి; శ్రీధర్ మారోజు & ఫ్రెండ్స్, రామాంజనేయులు చమిరాజు, అజయ్ నందగిరి, నరేష్ కుమార్ నౌల్ల, అభిమల్ల గిరి ప్రసాద్; కొల్లా శివ ప్రసాద్; మునిగెల కృష్ణం రాజు; పాతూరి రాంబాబు మరియు దండా నాగేశ్వర్ రెడ్డి, రెడ్డిపల్లి కృష్ణారావు, రవీంద్ర కుమార్ గార్లకు మరియు దేవాలయ యాజమాన్యానికి సొసైటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ పండుగలో ఫొటోగ్రఫీ కవరేజ్ చేసిన కృష్ణ నెల్లుట్లకి, సౌండ్ సాంకేతికతలో సహకరించిన యసరావేణి విజయ కుమార్ మెరుగుకి మరియు పండుగ విజయవంతంగా జరగడానికి తోడ్పడిన ప్రతిఒక్కరికి పేరు పేరున కమిటీ వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events