కువైత్‌లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఎన్నారై టీడీపీ శాఖ ఘనంగా నిర్వహించింది. కువైత్‌లోని ఫర్వానియా ప్రాంతంలో అధ్యక్షుడు మద్దిన ఈశ్వర్ నాయుడు అధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు పెద్ద ఎత్తున తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, నారా-నందమూరి అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి లోకేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
గల్ఫ్ ఎంపవర్మెంట్ కో-ఆర్డినేటర్ కుదరవల్లి సుధాకర రావు, కువైత్ గల్ఫ్ కౌన్సిల్ మెంబర్ కోడూరి వెంకట్, కువైత్‌లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యెనిగళ్ళ బాలకృష్ణ, కువైత్‌లో రెండు కార్యవర్గ సభ్యులు, ఉపాధ్యక్షులు రహమతుల్లా, షేక్ బాషా, ప్రధాన కార్యదర్శి వేగి వెంకటేష్ నాయుడు, గవర్నరేట్ కో-ఆర్డినేటర్స్ ఈడుపుగంటి దుర్గా ప్రసాద్, ముస్తాక్ ఖాన్, తెలుగుయువత అధ్యక్షులు కాపెర్ల వంశీ కృష్ణ, నరేష్ సన్నపనేని, మైనార్టీ నాయకులు షేక్ చాన్ బాషా, చిన్నా రాజు, మల్లికార్జున యాదవ్, మంచూరి శివ, కొల్లి ఆంజనేయులు, గుండయ్య నాయుడు, శివ మద్దిపట్ల, షేక్ అర్షద్ తదితరులు పాల్గొన్నారు.