బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని ఎన్నారై బీఆర్‌ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి తెలిపారు. ఎన్నారై బీఆర్‌ఎస్ యూకే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నవీన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ గొంతుకై, ఎలాగైతే ఉద్యమం సమయం నుంచి నేటి వరకు కేసీఆర్ వెంటే ఉండి ముందుకు నడిచామో, అదే స్ఫూర్తితో నేడు ప్రతిపక్ష పాత్రలో సైతం ప్రజల పక్షాన నిలబడి అటు సోషల్‌మీడియాలో, లంనడ్ కేంద్రంగా ప్రత్యేక నిరసనల ద్వారా కాంగ్రెస్ నిరంకుశ పాలనను ఎండగడుతామని తెలిపారు. రానున్న రోజుల్లో ఎన్నికలు ఎప్పుడొచ్చినా కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని పేరర్కొన్నారు. ఎంతోమంది ఎన్నారై మిత్రులు కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచడానికి పార్టీలో చేరుతున్నారని తెలిపారు. కాబట్టి ఎప్పటికీ కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ అని పేర్కొన్నారు.

కేసీఆర్ పిలుపు మేరకు నవంబర్ 29న లండన్‌లో దీక్షా దివస్ ఘనంగా నిర్వహించబోతున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా తనకు నూతన అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెం ట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోశ్, ఎన్నారై బీఆర్‌ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, ఎన్నారై బీఆర్‌ఎస్ కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల, అశోక్ గౌడ్ బీఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, వివిధ ఎన్నారై బీఆర్‌ఎస్ నాయకులకు, ఎన్నారై బీఆర్‌ఎస్ యూకే నూతన కార్యవర్గానికి నవీన్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు హరిగౌడ్ నవాపేట్, సత్యమూర్తి చిలుముల, రవి రేటినేనితో కలిసి నవీన్ రెడ్డి పాల్గొన్నారు.
