Namaste NRI

హాంకాంగ్‌ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా  దీపావళి వేడుకలు

ది హాంకాంగ్‌ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో దీపావళి వేడుకలను ఘనంగా జరిగాయి. హాంకాంగ్‌లోని స్థానిక ఇండియా క్లబ్‌లో నిర్వహించిన ఈ వేడుకల్లో సమాఖ్యలో సభ్యులుగా ఉన్న కుటుంబాలన్నీ పాల్గొన్నాయి. అందర్నీ ఆహ్వానిస్తూ వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటి ప్రారంభోపన్యాసం చేశారు. ప్రవాసులంతా ఒక్కచోట చేరడం వల్ల ఒకరికి మరొకరు తోడు ఉన్నారన్న భావన కలుగుతుందని చెప్పారు. కార్యవర్గసభ్యులు రాజశేఖర్‌ మన్నె, రమాదేవి సారంగ, మాధురి అరవపల్లి, హరీన్‌ తుమ్మల, రమేశ్‌  రేనిగుంట్ల తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.

. తదనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభించారు. చిన్న ఆదిత్య సార్ల శ్లోక పద్యాలతో వినాయకుడిని స్తుతిస్తూ కార్యక్రమం మొదలు పెట్టారు. ఆ తరువాత ప్రేక్షకులని పరవశింప చేసిన అద్వైత ఈయుణ్ణి తబలా ప్రదర్శన, మన కళల ప్రాముఖ్యతను చాటి చెప్పింది. చిన్నారులు గుణ ఘట్టి, భేవిన్ ఘట్టి మధురమైన లలిత సంగీతం వినిపించారు. అందరినీ ఆహ్లాద పరిచిన చిట్టిపొట్టి అడుగుల బుజ్జాయిలు జాహ్నవి బెల్లంకొండ, ధన్య సత్తినేని, అమృత ధర్మపురి, ముద్దొచ్చేలా తమ నృత్యాలతో అందరిని ఆశ్చర్యచకితుల్ని చేసారు. ఆ తరువాత, హాంగ్‌కాంగ్ తెలుగు భామలు హుషారైన డాన్స్ స్టెప్పులతో దీపావళి పటాసుల వలె ప్రదర్శనలిచ్చారు. అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, ముచ్చట్లు వేసుకుంటూ నోరు ఊరించే భోజనం చేసిన తరువాత, నృత్య – గాన ప్రదర్శనలతో అందరినీ ఆనందపరిచిన వారికి బహుమతులు ఇవ్వడం జరిగింది.

సాంస్కృతిక కార్యక్రమాన్ని చక్కటిచిక్కటి అచ్చ తెలుగులో రాధిక సంబతూర్, రాధిక నూతలపాటి చక్కగా నిర్వహించి అందరి మన్ననలు పొందారు. హాంగ్ కాంగ్ లో మూడు దశాబ్దాలకు పైగా నివసించిన వైద్య నిపుణులు డాక్టర్ మోహన్ భాస్కరభట్ల గారు, సతీమణి సూర్య గారు ఆకస్మిక సందర్శన అందరిని ఆశ్చర్యపరుస్తూ ఎంతో ఆనందాన్నిచ్చింది.  ఆ తరువాత అందరూ ఎంతో ఆనందంగా కలిసి గ్రూప్ ఫోటోలు,సెల్ఫీలు తీసుకొని వచ్చిన ప్రతి కుటుంబం తమ బహుమతులు ఉత్సాహంగా అందుకున్నారు. చివరిగా దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించిన, పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అందరు మన దేశ జాతీయ గీతంతో కార్యక్రమాన్ని ముగించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress