Skip to main content

Namaste NRI

ఛార్లెట్‌లో తానా (TANA) ఆధ్వర్యంలో ఘనంగా ఫాదర్స్ డే వేడుకలు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఛార్లెట్ విభాగం ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జూన్ 21వ తేదీన నిర్వహించిన ఫాదర్స్ డే హైకింగ్ ఈవెంట్ అత్యంత వైభవంగా, విజయవంతంగా జరిగింది. మూడు తరాలకు చెందిన సుమారు 60 మంది ఇందులో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో, అందమైన ప్రకృతి దృశ్యాల మధ్య సాగిన ఈ హైకింగ్‌లో ప్రతి ఒక్కరూ ఎంతో ఉల్లాసంగా గడిపారు. హైకింగ్ అనంతరం ఏర్పాటు చేసిన అల్పాహారం, కేక్ కటింగ్, ఆహూతుల స్నేహపూర్వక సంభాషణలు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మరపురాని వేడుకగా ఈ కార్యక్రమం నిలిచిందని ఇందులో పాల్గొన్నవారు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఛార్లెట్ లోని తానా నాయకులు మాట్లాడుతూ, కమ్యూనిటీకోసం తానా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందని, అందులో భాగంగా ఈ ఈవెంట్‌ను నిర్వహించామని చెప్పారు. మన జీవితానికి మార్గదర్శి నాన్న అని, ఈరోజు నిర్వహించిన ఈ ఫాదర్స్ డే వేడుకలకు ఇంత మంచి స్పందన రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలుగువారి మధ్య ఐక్యతను ప్రతిబింబించేలా తమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని కూడా చెప్పారు. ఈ కార్యక్రమానికి వచ్చినవారు ఒకరినొకరు పరిచయం చేసుకునే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా లభించిందన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ, స్వచ్ఛంద సేవకులకు తానా ప్రతినిధులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమ నిర్వహణకు నాని వడ్లమూడి, ఠాగూర్ మల్లినేని, కిరణ్ కొత్తపల్లి, మాధురి ఏలూరి , నాగ పంచుమర్తి, పట్టాభి కంఠమనేని మరియు అన్నే రమణ తదితరులు కృషి చేశారు.

Social Share Spread Message

Latest News