Skip to main content

Namaste NRI

నిఖిల్ స్వయంభు గ్రాండ్ లాంచ్

హీరో నిఖిల్‌ 20వ చిత్రం స్వయంభు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఠాగూర్‌ మధు సమర్పణలో భువన్‌, శ్రీకర్‌ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి దిల్‌ రాజు కెమెరా స్విఛాన్‌ చేయగా, అల్లు అరవింద్‌ క్లాప్‌కొట్టారు. తొలి సన్నివేశానికి రామజోగయ్యశాస్త్రి దర్శకత్వం వహించారు. అనౌన్స్‌మెంట్‌ పోస్టర్స్‌లో నిఖిల్‌ను ఓ యోధుడిగా చూపించారు. నిఖిల్‌ కెరీర్‌లోనే అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కించబోతున్నాం. సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో ఉంటుంది.   నిఖిల్ యోధుడిగా గుర్రపు స్వారీ చేస్తూ డ్రాగన్‌పై బాణం వేస్తున్నట్లు కనిపించిన స్టప్‌ఫైయింగ్ పోస్టర్ ద్వారా అనౌన్స్ మెంట్ చేశారు. మునుపెన్నడూ చూడని పాత్రలో నిఖిల్ కనిపిస్తున్నారు. నటుడి కెరీర్‌లోనే అత్యంత భారీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో నిఖిల్ సరసన సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తోంది. రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుపెడుతున్నాం అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: మనోజ్‌ పరమహంస, సంగీతం: రవి బస్రూర్‌, సంభాషణలు: వాసుదేవ్‌ మునెప్పగారి, బ్యానర్‌: పిక్సల్‌ స్టూడియోస్‌, రచన-దర్శకత్వం: భరత్‌ కృష్ణమాచారి.

Social Share Spread Message

Latest News