రవితేజ, శ్రీలీల కాంబినేషనల్ వచ్చిన ధమాకా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. త్రినాథరావు నక్కిన దర్శకత్వం. తాజాగా ఈ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రొడక్షన్ నంబర్ 2గా హోంబ్యానర్ నక్కిన నరేటివ్స్‌పై కొత్త సినిమా ప్రకటించారు. ఆంధ్రా బ్యాక్‌డ్రాప్‌లో సాగే యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో విక్రమ్ సహిదేవ్ లగడపాటి హీరోగా నటిస్తున్నాడు. వంశీకృష్ణ మల్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఎన్‌వీఎస్‌ఎస్ సురేశ్ కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించనున్నాడు. సినిమా చూపిస్త మావ తర్వాత త్రినాథరావు నక్కిన ఈ చిత్రాని కి కథనందిస్తుండటం విశేషం.
విక్రమ్ సహిదేవ్ లగడపాటి పలు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. టైటిల్ ఫిక్స్ కాని ఈ మూవీ లాంఛ్ సెర్మనీ ఇవాళ గ్రాండ్‌గా జరిగింది. త్రినాథ రావు నక్కిన, నాయుడు స్క్రిప్ట్‌ను డైరెక్టర్‌కు అందించారు. శరత్ మరార్ కెమెరా స్విఛాన్ చేయగా, సందీప్ కిషన్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, సుమంత్ ఫస్ట్ షాట్‌ను డైరెక్ట్ చేశాడు. సూపర్ హిట్ ప్రాంఛైజీ దృశ్యంలో వెంకటేశ్ కూతురుగా నటించిన ఈస్తర్ అనిల్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది.