మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (మాటా) ఆధ్వర్యంలో కళావేదిక సమర్పణలో అమెరికాలో మదర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. న్యూజెర్సీలోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్‌లో జరిగిన ఈ ఉత్సవాల్లో హీరోయిన్ శ్రీలీల, యాంకర్ సుమ, గెస్ట్ సింగర్ శ్రీనిధి తిరుమల తదితరులు పాల్గొని సందడి చేశారు. ఎడిషన్ టౌన్‌షిప్ మేయర్ సామ్ జోషి ప్రత్యేక వీడియో సందేశం పంపించారు. ఈ కార్యక్రమానికి తల్లితో కలిసి శ్రీలీల హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీలీల మాట్లాడుతూ తల్లితో ఉన్న అనుంబంధాన్ని తెలిపారు. సినిమాల్లో తాను హీరోయిన్ అయితే, నిజ జీవితంలో తనకు మాత్రమే అమ్మే హీరోయిన్ అని చెప్పారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కుర్చీ మడత పెట్టి పాటకు శ్రీలీల స్పెప్టులేసి ఉత్సాహపరిచారు. మహిళలతో యాంకర్ సుమ నిర్వహించిన కార్యక్రమాలు అలరించాయి.
ఎన్‌ఆర్‌ఐలకు ఆరోగ్య పరంగా హెల్ప్ చేయడమే లక్ష్యంగా సుమ, శ్రీలీల చేతుల మీదుగా మాటా హెల్త్ హెల్ప్ లైన్ ను లాంచ్ చేశారు. మన అమెరికన్ తెలుసు అసోసియేషన్ ప్రారంభమైన అనతికాలంలోనే సాధించిన మరో గొప్ప సేవా కార్యక్రమం ఇది అని అధ్యక్షుడు శ్రీనివాస్ గనగోని తెలిపారు. మున్ముందు అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో హెల్త్ స్క్రీనింగ్ సెంటర్లు ప్రారంభిస్తామని తెలిపారు. మదర్స్ డే వేడుకల్లో పాల్గొన్న అందరికీ శ్రీనివాస్ గనగోని ధన్యవాదాలు తెలిపారు.
దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, బీజేపీ స్టేట్ ఆఫీస్ బేరర్ రవికాంతి ప్రదీప్ ఈ వేడుకల్లో పాల్గొని మాతృమూర్తులకు ధన్యవాదాలు తెలిపారు. కళా వేదిక ప్రెసిడెంట్ స్వాతి అట్లూరి, సెక్రటరీ ఉజ్వల్ కుమార్ కస్తాల, ట్రెజరర్ రవీంద్రనాథ్ నిమ్మగడ్డ, ఈవెంట్ కోఆర్డినేటర్ రంజనీ ఉండవల్లి, ట్రస్టీ సాకేత్ చదవలవాడ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిరణ్ దుద్దగి, జాయింట్ సెక్రటరీ టోనీ జన్ను, జాయింట్ ట్రెజరర్ సుంకిరెడ్డి, సెక్రటరీ ప్రవీణ్ గూడూరు, ట్రెజరర్ గంగాధర్ ఉప్పల, నేషనల్ కో ఆర్డినేటర్ విజయ్ భాస్కర్ పాల్గొన్నారు.