Skip to main content

Namaste NRI

ఘనంగా వెంకట్రామయ్య గారి తాలూకా ప్రీ రిలీజ్ వేడుక

ప్రముఖ జానపద గాయని కోమలి నిర్మాతగా మారుతూ నిర్మించిన భావోద్వేగ కుటుంబ కథా చిత్రం వెంకట్రామయ్య గారి తాలూకా. జూలై 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దినేష్ కుమార్ హీరోగా, ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ప్రభాకర్ హీరోయిన్‌గా పరిచయమవుతున్న ఈ చిత్రానికి సతీష్ ఆవాల కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం వహించారు. కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. దర్శకుడు దశరథ్ కూడా ఈ వేడుకలో పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.

కవిత మాట్లాడుతూ ఫోక్ సింగర్ కోమలి ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని నిర్మించారని ప్రశంసించారు. తెలంగాణ ఉద్యమకారిణి అయిన కోమలి సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. చిన్న సినిమాలకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు కల్పించాలని సూచిస్తూ, తెలంగాణలో చిన్న సినిమాల అభివృద్ధికి తమ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తెలుగు సినిమాల మాదిరిగానే తెలుగు ప్రజలు కూడా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం సతీష్ ఆవాల అందించగా, కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి నిర్మాతలుగా వ్యవహరించారు. చరణ్ అర్జున్ సంగీతం అందించగా, అనిల్ కుమార్ ఛాయాగ్రహణం వహించారు. పి.ఆర్.ఓ.గా కడలి రాంబాబు బాధ్యతలు నిర్వహించారు. ప్రధాన తారాగణంలో దినేష్ కుమార్, దివిజ ప్రభాకర్, మురళీధర్ గౌడ్, సుధ, కాశీ విశ్వనాథ్, సెల్వరాజ్, మిర్చి మాధవి, జబర్దస్త్ సత్యశ్రీ, హాసిని, యూట్యూబర్స్ జీవనప్రియ, గౌరి నాయుడు తదితరులు నటించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events