Skip to main content

Namaste NRI

అట్లాంటాలో ఘనంగా ఎన్ఆర్ఐ తెలుగు వైద్య పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

అమెరికాలో తెలుగు వైద్య కళాశాలల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. గుంటూరు వైద్య కళాశాల (జీఎమ్‌సీ), సిద్ధార్థ వైద్య కళాశాల(ఎస్ఎంసీ) రంగరాయ వైద్య కళాశాల (ఆర్ఎంసీ) ల ఉత్తర అమెరికా పూర్వ విద్యార్థుల 19వ ద్వైవార్షిక సమావేశం ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. అట్లాంటా వేదికగా జరిగిన ఈ సమావేశానికి ఆయా కళాశాలల్లో వైద్య విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులు తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు.


జీఎంసీఏఎన్ఏ అధ్యక్షుడు డాక్టర్ రామ కోటేశ్వరరావు, కన్వీనర్ డాక్టర్ శివ సుధాకర్, ఆర్ఎంసీఏఎన్ఏ అధ్యక్షురాలు డాక్టర్ అనూష, కన్వీనర్ డాక్టర్ కృష్ణకాంత్, ఎస్ఎంసీఏఎన్ఏ అధ్యక్షురాలు డాక్టర్ సంయుక్త, కన్వీనర్ డాక్టర్ శ్రీదేవి మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. రెండు రోజుల పాటు కొనసాగిన ఈ సమావేశంలో తొలి రోజు శ్రేయ లక్ష్మి కోడెల ఆలపించిన భక్తి గీతంతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం శివ గ్రూప్ డ్యాన్స్, జ్యోత్స సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు అలరించాయి.

అమెరికన్ మెడికల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ బాబీ ముక్కామల కీలక ప్రసంగం చేశారు. అనంతరం మాతా శిశు ఆస్పత్రి ప్రాజెక్టు ప్రాముఖ్యతపై ఆర్ఎంసీఏఎన్ఏ మాజీ అధ్యక్షులు డాక్టర్ సుబ్బరాయ చౌదరి ప్రజెంటేషన్ ఇచ్చారు. సీఎం చంద్రబాబు సూచన మేరకు టీటీడీ బోర్డు సభ్యులు, నాట్కో పరిశ్రమకు చెందిన నన్నపనేని సదాశివరావు శ్రీవారి సేవ పై ప్రజెంటేషన్ ఇచ్చారు.

జీఎంసీఏఎన్ఏ ఫ్యూచర్ అధ్యక్షులుగా డాక్టర్ రామన్ దామినేని, ఆర్ఎంసీఏఎన్ఏ ఫ్యూచర్ అధ్యక్షులుగా డాక్టర్ శ్రీనివాస్ బసవయ్య గోకరకొండ, ఎస్ఎంసీఏఎన్ఏ ఫ్యూచర్ అధ్యక్షులుగా డాక్టర్ దివాకర్ వి.లింగం ఎన్నికయ్యారు. వీరంతా ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగనున్నారు.

ఈ సమావేశంలో పాల్గొన్న వారంతా విరామ సమయంలో గోల్ఫ్, పికిల్ బాల్, యోగా వంటి కార్యకలాపాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యుకె లో నివాసం ఉంటున్న గుంటూరు మెడికల్ కాలేజీ, రంగరాయ మెడికల్ కాలేజీ, సిద్దార్థ మెడికల్ కాలేజీలకు చెందిన కొందరు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.


Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events