తెలుగుఅసోసియేషన్ఆఫ్జపాన్ (తాజ్) ఆధ్వర్యంలో టోక్యోలో ఘనంగా సంక్రాంతివేడుకలునిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు నిర్వహించిన ముగ్గుల పోటీలు, యువకులకు గాలిపటాల పోటీలు విశేషంగా ఆకట్టు కున్నాయి. టోక్యో ఆడిటోరియంలో చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, తెలుగు పాటలకు జపాన్ యువత డ్యాన్స్ ఆహుతులను మంత్రముగ్ధులను చేసింది. స్వదేశానికి దూరంగా ఉన్నప్ప టికీ తెలుగు సంస్కృతి సంప్రదాయా లకు దగ్గరగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి ఏటా సంక్రాంతి, ఉగాది, దీపావళి, దసరా వేడుకలు టోక్యోలో ఘనంగా నిర్వహించుకుంటున్నామని తెలుగు అసోసియేషన్ ఆఫ్ జపాన్ ప్రతినిధులు తెలిపారు. టోక్యోలోని తెలుగువారంతా కలిసి ఈ సంబరాలు జరుపుకున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2024/01/1_150cfb865c-1024x576.jpg)