Namaste NRI

టొరంటోలో ఘనంగా టీసీఏ ధూమ్ ధామ్ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలను  గ్రేటర్ టోరంటోలో తెలంగాణ కెనడా అసోసియేషన్ (టీసీఏ) ఆధ్వర్యంలో ధూమ్ ధామ్  పేరుతో డాంటే అలిగేరి అకాడమీ, కిప్లింగ్ లో వైభవంగా నిర్వహించారు. ఈ సంబరాలలో 1800 కు పైగా తెలంగాణవాసులు పాల్గొన్నారు. ఈ సంబరాలు కమిటీ సంయుక్త కార్యదర్శి రాజేష్ ఏర్ర ప్రారంభించారు. అలాగే స్వాతి మన్నెం, శ్రీమతి అమృత దీప్తి కర్రి, శ్రీమతి కవిత తిరునగరి, ప్రసన్న మేకల, స్ఫూర్తి కొప్పు గారు జ్యోతి ప్రజ్వలన చేయగా కుమారి ఐక్య ఏర్ర గణేష వందనంతో సంబరాలను ప్రారంభించారు.  ఈ సందర్బంగా ప్రెసిడెంట్ అఫ్ తెలంగాణ కెనడా అసోసియే షన్ శ్రీనివాస్ మన్నెం, సంయుక్త కార్యదర్శి శ్రీ రాజేష్ ఏర్ర, ధర్మకర్తల మండలి చైర్మన్ నవీన్ ఆకుల, వ్యవస్థాపక కమిటీ చైర్మన్ అతిక్ పాషా గారు వేదికపై పాల్గొన్నారు. ఈ సంబరాలను తెలంగాణ కెనడా అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆధ్వర్యంలో బోర్డు అఫ్ ట్రస్టీ, వ్యవస్థాపక సభ్యుల సహకారంతో విజయవంతంగా నిర్వహించారు.

ప్రముఖ సినీ నటుడు, రచయిత మరియు దర్శకుడు తనికెళ్ళ భరణి మాట్లాడుతూ తెలంగాణ ప్రాముఖ్యత, అభివృద్ధిని కొనియాడారు. తెలంగాణ కెనడా అసోసియేషన్ కమిటీ సభ్యులు, కెనడాలోని తెలంగాణవాసులు, సంస్థ శ్రేయోభిలాషులకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. ధూమ్ ధామ్ ఉత్సవాలను సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి స్ఫూర్తి కొప్పు సహకారంతో శ్రీమతి శ్రీరంజని కందూరి, కుమారి ప్రహళిక మ్యాకల తదితరులు వ్యాఖ్యాతలుగా వ్యవహరించి ప్రేక్షకులను అలరించారు. ఈ సంబరాలలో కూచిపూడి నృత్యాలయం ఆధ్వర్యంలో ప్రదర్శించిన అదిగో అల్లదిగో, కృష్ణం వందే జగద్గురుం, గోవిందా అని కొలవరే, రామాయణ శబ్దం, మరోవేదిక డాన్సింగ్ దియాస్ బోనాల జాతరకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది.

 ఈ సందర్బంగా  టీసీఏ  అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ మన్నెం మాట్లాడుతూ టీసీఏ ఈవెంట్స్ స్పాన్సర్లు, నిర్వహకులుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. టీసీఏ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటూ లోకల్ బిజినెస్‌లను కూడా ప్రతి వేడుకల్లో ప్రోత్సహిస్తోదన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా అనేక మంది వ్యాపారులు తమ స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక మండలి అధ్యక్షుడు శ్రీనివాస్ మన్నెం, ఉపాధ్యక్షుడు శ్రీ మనోజ్ రెడ్డి, సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి స్ఫూర్తి కొప్పు, సంయుక్త కార్యదర్శి రాజేష్ ఏర్ర, సంయుక్త సాంస్కృతిక కార్యదర్శి కుమారి ప్రహళిక మ్యాకల , కోశాధికారి వేణుగోపాల్ ఏళ్ల, సంయుక్త కోశాధికారి రాహుల్ బాలనేని, డైరెక్టర్లు – శ్రీ శంకర్ భరద్వాజ పోపూరి , నాగేశ్వరరావు దలువాయి, ప్రణీత్ పాలడుగు, శ్రీరంజని కందూరి, శ్రీ భగీరథ దాస్ అర్గుల, ప్రవీణ్ కుమార్ సామల, ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ నవీన్ ఆకుల, బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ సభ్యులు – శ్రీమతి ప్రసన్న మేకల, మురళీధర్ కందివనం, వ్యవస్థాపక కమిటీ చైర్మన్ అతిక్ పాషా, వ్యవస్థాపక సభ్యులు కోటేశ్వర రావు చిత్తలూరి, హరి రావుల్, శ్రీనివాస తిరునగరి, విజయ్ కుమార్ తిరుమలపురం, ప్రభాకర్ కంబాలపల్లి, దేవేందర్ రెడ్డి గుజ్జుల, అఖిలేష్ బెజ్జంకి, కలీముద్దీన్ మొహమ్మద్, రాజేశ్వర్ ఈధ గారు, వేణుగోపాల్ రోకండ్ల పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress