దక్షిణాఫ్రికాలోని జొహానెస్‌బర్గ్ నగరంలో ఉగాది వేడుకలు తెలుగుదనం ఉట్టిపడేలా కౌన్సిలేట్ జెనెరల్ అఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ అసోసి యేషన్ అఫ్ సౌత్ ఆఫ్రికా (ఆశ) ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఆశ అధ్యక్షు డు జయప్రకాశ్ కొప్పు రాజు ఆశ చేస్తున్న సేవ కార్యక్రమాలు ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ ఎవర్నెస్ గురించి చేస్తు న్న కృషిని వివరించారు. ప్రతి సంవత్సరం తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా శక్తి వంచన లేకుండా ఉగాది ఉత్సవాలు చేస్తున్న ఆశ కార్యవర్గ స్ఫూర్తిని జోహనెస్ బర్గ్ ప్రత్యేకంగా అభినందిం చారు. అనంతరం ఉగాది సందర్భంగా నిర్వహించే క్రీడా పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు.