Namaste NRI

న్యూజెర్సీలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

అమెరికాలోని న్యూజెర్సీలో  హిందువులు అత్యంత పవిత్రంగా ఆచరించే వైకుంఠ ఏకాదశి వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. న్యూజెర్సీలోని సాయిదత్తపీఠం శ్రీశివ విష్ణు దేవాలయం వేడుకలకు వేదికైంది. స్థానిక ఎన్నారై భక్తులు హరి నామాన్ని స్మరించుకుంటూ ఉత్తర ద్వారం నుంచి దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యతను సాయిదత్త పీఠం నిర్వాహకులు రఘుశర్మ శంకర మంచి భక్తులకు వివరించారు. పురాణాల ప్రకారం విష్ణుమూర్తి గరుడ వాహనంపై ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకంలోకి అడుగు పెట్టి భక్తులందరికీ దర్శనమిస్తారు. అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారని ఆయన తెలిపారు. ఈ వేడుకలో  భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News