టాలీవుడ్ నటుడు మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. హైదరాబాద్ ఫిలింనగర్‌లోని మంచు లక్ష్మి నివాసంలో గత రాత్రి 8.30 గంటల సమయంలో మౌనిక మెడలో మనోజ్ మూడుముళ్లు వేశాడు. ఈ వేడుకకు దగ్గరి బంధువులు, ఇరు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. టీజీ వెంకటేశ్, కోదంరామిరెడ్డి, పరుచూరి గోపాలకృష్ణ, నిక్కీ గల్రానీ, దేవినేని అవినాశ్ తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పలువురు సినీ సెలబ్రెటీలు, మంచు అభిమానులు ఈ జంటకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.