Namaste NRI

పరుచూరి మనవడు.. మిస్టర్‌ సెలెబ్రిటీ టీజర్‌ విడుదల

ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు మనవడు పరుచూరి సుదర్శన్‌ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం మిస్టర్‌ సెలెబ్రిటీ. రవికిశోర్‌ దర్శకుడు. ఎన్‌.పాండురంగారావు, చిన్న రెడ్డయ్య నిర్మాతలు. వరలక్ష్మీ శరత్‌కుమార్‌, శ్రీదీక్ష, నాజర్‌, రఘుబాబు ఇందులో కీలక పాత్రధారులు. ఈ సినిమా టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. యాక్షన్‌, సస్పెన్స్‌ అంశాలతో కూడిన సినిమా ఇదని టీజర్‌ చెబుతున్నది. రూమర్లు, పుకార్ల ను బేస్‌ చేసుకొని దర్శకుడు రవికిశోర్‌ ఈ కథ తెరకెక్కించినట్టు తెలుస్తున్నది. సుదర్శన్‌ యాక్టింగ్‌ సినిమాలో హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్‌ చెబుతున్నారు. ఆడియన్స్‌కి కనెక్టయ్యే సబ్జెక్ట్‌తో తీసిన ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని పరుచూరి వెంకటేశ్వరరావు అభిలషించారు. ఇంకా చిత్ర యూనిట్‌ సభ్యులతోపాటు అతిథిగా విచ్చేసిన రచయిత సాయిమాధవ్‌ బుర్రా కూడా మాట్లాడారు. ఈ సినిమాకు కెమెరా: శివకుమార్‌ దేవరకొండ, సంగీతం: వినోద్‌ యజమాన్య. నిర్మాణం: ఆర్పీ సినిమాస్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events