విశ్రాంత్, మెహరీన్ జంటగా నటిస్తున్న స్పార్క్ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. డైఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్నది. ఈ కార్యక్రమానికి సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి ఎంపీ రంజిత్ రెడ్డి క్లాప్‌నిచ్చారు. ఈ చిత్రం ద్వారా సినిమాటోగ్రాఫర్ అరవింద్‌కుమార్ వర్మ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. వైవిధ్యమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.రు. ఓ ప్రముఖ సంగీత దర్శకుడు ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తారని సినీ వర్గాలు తెలిపారు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సత్య, శ్రీకాంత్ అయ్యంగార్, అన్నపూర్ణమ్మతో పాటు టాలీవుడ్‌లో టాప్‌లో ఉన్న ఆర్టిస్టులు పరిచయం అవుతున్నారు. యాక్షన్ థ్రిల్లర్ ఇది. తొలి షెడ్యూల్‌ను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుపుతాం. వైజాగ్, డార్జిలింగ్, ముంబయి, గోవాలో మిగిలిన షెడ్యూల్స్ పూర్తి చేస్తాం అని చిత్ర బృందం తెలిపింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/telusukada-300x160.jpg)