![](https://namastenri.net/wp-content/uploads/2024/06/f8900b5f-232d-4ed0-9e9a-f342ae9bc1c6-69.jpg)
టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా జరిగిన కీలక మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. గ్రూప్ ఏలో అమెరికాతో తలపడిన భారత్, 7 వికెట్లతో గెలుపొంది సూపర్ 8కు అర్హత సాధించింది. కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికాను అద్బుతమైన బౌలింగ్‌తో 110 పరుగులకే పరిమితం చేసిన టీమిండియా, అనంతరం చేజింగ్‌లోనూ అదరగొట్టింది. 111 పరుగుల స్వల్ప చేధనలో సూర్యకుమార్ యాదవ్ (50 నాలౌట్) అర్ధ శతకంతో చెలరేగాడు. మరోవైపు గత రెండు మ్యాచ్‌ల్లో నిరాశపరిచిన దూబే (31 నాలౌట్)తో ఆకట్టుకున్నా డు. రిషబ్ పంత్ (18)తో రాణించాడు. అయితే, ఈ స్టేడియంలో ఇదే అత్యధిక విజయవంతమైన ఛేజింగ్ (111) కావడం విశేషం. ఇక, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా తర్వాత సూపర్ 8కి అర్హత సాధించిన 3వ జట్టుగా భారత్ నిలిచింది.
![](https://namastenri.net/wp-content/uploads/2024/06/50e409c6-592a-4e9f-922f-2a94141522d8-69.jpg)