హెబ్బా పటేల్, వశిష్ట సింహ, సాయి రోనక్, పూజిత పొన్నాడ, గగన్ విహారి, నాగ మహేశ్ నటించిన ఓదెల రైల్వేస్టేషన్ విడుదలకు సిద్ధమైంది. దర్శకుడు సంపత్ నంది అందించిన కథ, స్క్రీన్, ప్లేతో అశోక్ తేజ్ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న ఓటీటీ వేదిక ఆహా లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో వశిష్ట సింహ మాట్లాడుతూ ఓదెల రైల్వేస్టేషన్ చాలా మంచి కథ. నాకు చాలా ఇష్టమైన సినిమా అన్నారు. హెబ్బాపటేల్ మాట్లాడుతూ ఓరేయ్ బుజ్జిగా క్యామియో రోల్ చేసినప్పుడే నిర్మాత రాధామోహన్ నాతో మరో సినిమా చేస్తానన్నారు చేశారు. సంపత్ నంది ఈ కథ చెప్పినప్పుడు చాలా సర్‌ప్రైజ్ ఫీలయ్యాను. ఒక సవాల్‌తో కూడిన నా పాత్రను చేసేటప్పుడు నటిగా ఎంతో నేర్చుకున్నానని తెలిపారు. ఓదెల్ రైల్వేస్టేషన్ క్రైమ్ థ్రిల్లర్. 50 రోజుల్లో సినిమా షూటింగ్‌ను పూర్తి చేసినా కోవిడ్ వల్ల రిలీజ్ కాస్త ఆలస్యమైంది అన్నారు రాధామోహన్. నాకు దర్శకుడిగా చాన్స్ ఇచ్చిన సంపత్ నందిగారికి రుణ పడి ఉంటాను. ఈ సినిమాలో నటించిన అందరికీ మంచి పేరు వస్తుంది అన్నారు అశోక్ తేజ్. ఈ కార్యక్రమంలో ఆహా ప్రతినిధి శ్రీనివాస్ పాల్గొన్నారు.