తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. రేవంత్ రెడ్డి భవిష్యత్తు మరింత అద్భుతంగా ఉండాలని చంద్రబాబు పేర్కొన్నారు. తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. కొడంగల్ నివాసంలో పలువురు నేతలు ముఖ్యమంత్రిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వీరితో పాటు మంత్రులు ధనసరి అనసూయ సీతక్క, వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లు రవితో పాటు పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు ముఖ్యమంత్రి ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

జన్మదినం సందర్భంగా ప్రత్యక్షంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారితో పాటు వివిధ మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులు, ప్రముఖులు, అధికారులు, కార్యకర్తలకు ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.














