ఆది సాయికుమార్ కథానాయకుడిగా పొలిమేర నాగేశ్వర్ తెరకెక్కించిన చిత్రం అతిథి దేవో భవ. రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల సంయుక్తంగా నిర్మించారు. నువేక్ష కథానాయిక. ఈ నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో రాజశేఖర్ మాట్లాడుతూ ఆది చిత్రం కోసం ఇలా రావడం చాలా ఆనందంగా ఉంది. పాటలు వింటుంటే సినిమా బాగుంటుందని అర్థమవుతోంది. ఈ చిత్రంతో ఆదికి పెద్ద సక్సెస్ రావాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా అన్నారు. మొన్నే ఈ చిత్రం చూశా. అందమైన ప్రేమకథతో రూపొందింది. మంచి వినోదం ఉంది. సినిమా ఏ ఒక్కరినీ నిరాశ పరచదు. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది అన్నారు. నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ మా కుటుంబ సభ్యులు ప్రజలు మెచ్చే మంచి సినిమాలే తీస్తారు. ఈ మధ్యే ఈ సినిమా చూశా. వినోదంతో పాటు హృదయాన్ని స్పృశించే భావోద్వేగాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది అన్నారు. ట్రైలర్ చూసిన తర్వాత సినిమా విజయం తథ్యమనే భావన కలిగిందని యువహీరో కార్తికేయ చెప్పారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)