గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు తన రాజీనామా లేఖను గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌కు ఇచ్చారు. అయితే ఆయన రాజీనామా ఎందుకు చేశారు అనే అంశంపై ఇంకా క్లారిటీ లేదు. వచ్చే ఏడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విజయ్ రూపాన్ని రాజీనామా అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2016వ సంవత్సరం నుంచి విజయ్ రూపాన్ని గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేస్తున్నారు. ఆనంది బెన్ పటేల్ రాజీనామా అనంతరం విజయ్ రూపాన్ని గుజరాత్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. బీజేపీ అధిష్టానం ఆదేశాలతోనే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. కొత్త నాయకత్వం నేతృత్వంలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.