Namaste NRI

గుంటూరు కారం దమ్ మసాలా ఫుల్ సాంగ్ వచ్చేసింది

మహేష్‌బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు.  ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నది.  ఈ చిత్రంలో జగపతిబాబు, జయరామ్‌, ప్రకాష్‌రాజ్‌, రమ్యకృష్ణ తదితరులు నటిస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్‌ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ధమ్‌ మసాలా గీతాన్ని విడుదల చేశారు. రామజోగయ్యశాస్త్రి రచించిన ఈ గీతాన్ని సంజిత్‌హెగ్డే, జ్యోతి నూరన్‌ ఆలపించారు. తమన్‌ స్వరకర్త. సరికొత్త ట్యూన్‌, మాస్‌ బీట్‌తో ఈ పాట ఆకట్టుకునేలా సాగింది. నా తలరాతే రంగుల రంగోలి, దిగులైనా చేస్తా దీవాళి. నా నవ్వుల కోటని నేనే ఎందుకు పడగొట్టాలి, నేనో నిశ్శబ్దం అనునిత్యం నాతో నాకే యుద్ధం వంటి చరణాలు హీరో స్వభావాన్ని ఆవిష్కరిసూ సాగాయి. సంక్రాంతి పర్వదినం సందర్భంగా విడుదలకానుంది. ఈ చిత్రానికి కెమెరా: మనోజ్‌ పరమహంస, సంగీతం: తమన్‌, రచన-దర్శకత్వం: త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events