
అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జీడబ్ల్యూటీసీఎస్ స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతిఒక్కరినీ అలరించాయి. అందాల పోటీలతో పాటు ఆట, పాటల పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచినవారికి బహుమతులు అందజేశారు. కల్చరల్ గాలా పేరుతో గోల్డెన్ వాయిస్ పోటీలను సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగాల వారీగా నిర్వహించారు. డాన్సింగ్ సూపర్ స్టార్ పేరుతో సబ్ జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో ప్రవాసాంధ్రులు ఉల్లాసంగా పాల్గొన్నారు.


ఈ సందర్భంగా జీడబ్ల్యూటీసీఎస్ అధ్యక్షుడు కృష్ణ లాం మాట్లాడుతూ సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రవాసాం ధ్రుల నుంచి వచ్చిన స్పందన చూసి చాలా సంతోషంగా ఉందన్నారు. వివిధ పోటీల్లో చక్కటి ప్రతిభ కనబరిచిన వారందరినీ ఆయన అభినందించారు. జీడబ్ల్యూటీసీఎస్ స్వర్ణోత్సవ వేడుకలను కూడా విజయ వంతం చేయాలని కోరారు. ఈ పోటీలను కల్చరల్ వైస్ ప్రెసిడెంట్ సుష్మ అమృతలూరి, సెక్రటరీ శ్రీ విద్యా సోమతో పాటు టీం గణేష్ ముక్కనంద చెల్లువేది అమర్ అతికం, శ్రావణి వింజమూరి, నివేదిత చంద్రుపట్ల, శిరీష, పావని పూదోట తదితరులు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమానికి సుశాంత్ మన్నె, రవి అడుసుమిల్లి, భాను మాగులూరి, శ్రీనివాస్ గంగ, పద్మజ బెవరా, చంద్ర మాలావతు, ఈసీ కమిటీ సభ్యులు నేతృత్వం వహించారు.



