2024-25 ఆర్థిక సంవత్సరానికి హెచ్-1బీ వీసాల కోసం దరఖాస్తులను ఆన్‌లైన్‌లో దాఖలు చేసేందుకు ఫిబ్రవరి నుంచి అవకాశం కల్పించనున్నట్లు అమెరికా ఇటీవల ప్రకటించింది. యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) కూడా హెచ్-1బీ రిజిస్ట్రేషన్స్ ఆన్‌లైన్ కొలాబరేషన్, సబ్మిషన్ లకు అవకాశం కల్పించే ఆర్గనైజేషనల్ అకౌంట్స్‌ను ప్రవేశపెట్టబోతున్నది. అకౌంట్ లభ్యత, రిజిస్ట్రేషన్ తేదీ లకు సంబంధించిన అధికారిక ప్రకటన ఈ నెలాఖరునాటికి వెలువడే అవకాశం కనిపిస్తున్నది.
పరిమితి లేని ఫైలింగ్స్, 2025 ఆర్థిక సంవత్సరం పరిమితి సీజన్ కోసం ఆర్గనైజేషనల్ అకౌంట్స్‌ను ప్రారంభించబోతున్నట్లు యూఎస్‌సీఐఎస్ ప్రకటించింది. హెచ్-1బీ రిజిస్ట్రేషన్స్ కోసం సమన్వయంతో పని చేసి, తయారుచేసే అవకాశం ఆర్గనైజేషనల్ అకౌంట్స్‌లో కంపెనీ లేదా ఇతర వ్యాపార సంస్థల్లోని వ్యక్తులకు, వారి లీగల్ రిప్రజెంటేటివ్‌లకు ఉంటుందని తెలిపింది. నాన్ ఇమిగ్రెంట్ వర్కర్ కోసం దరఖాస్తు ఫారం ఐ- 129 అని, ప్రీమియం ప్రాసెసింగ్ సర్వీస్ కోసం విజ్ఞప్తి కోసం ఫారం ఐ-907 అని తెలిపింది. ఈ ఫారాలను ఆర్గనైజేషనల్ అకౌంట్స్ ద్వారా ఆన్‌లైన్‌లో దాఖలు చేయవచ్చు.