Namaste NRI

యూఎస్ ఓపెన్ లో హలెప్ శుభారంభం

ఆరు నెలల విరామం తర్వాత బరిలోకి దిగిన ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ సిమోనా హలెప్‌ యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో శుభారంభం చేసింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ఆమె 6-4, 7-6 (7/3)తో కమాలియా జార్జి (ఇటలీ)పై నెగ్గి రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్‌లో హలెప్‌కు  గియార్గి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. ముఖ్యంగా రెండో సెట్‌ టైబ్రేకర్‌ వరకు వెళ్లింది. కానీ టైబ్రేకర్‌లో జోరుగా ఆడిన సిమోనా సెట్‌తో పాటు మ్యాచ్‌ను దక్కించుకుంది. ఈ పోరులో ఆమె 14 విన్నర్లు కొట్టడంతో పాటు 6 ఏస్‌లు సంధించింది. ముగురుజ కూడా రెండో రౌండ్‌ చేరింది.

                 ఈ తొమ్మిదో సీడ్‌ 7-6 (7/4),  7-6 (7/5)తో వికిచ్‌  (క్రొయేషియా)ను ఓడిరచింది. కుకోవా (స్లొవేకియా), కలినినా (ఉక్రెయిన్‌), లెలా ఫెర్నాండెజ్‌ (కెనడా) తొలి రౌండ్‌ దాటారు. పురుషుల సింగిల్స్‌లో బాగ్నిస్‌ (అర్జెంటీనా) రెండో రౌండ్‌ చేరాడు. తొలి రౌండ్లో అతడు 6-3, 6-3, 6-3తో డానియల్‌ (కెనడా)ను ఓడిరచాడు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events