దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం కింగ్ ఆఫ్ కోతా. అభిలాష్ జోషి దర్శకత్వం వహిస్తున్నారు. గ్యాంగ్స్టర్ డ్రామా నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలోని హల్లా మచారే అనే గీతాన్ని విడుదల చేశారు. జేక్స్ బిజోయ్ స్వరపరచిన ఈ పాటను ఎల్.వి.రేవంత్, సింధూజ ఆలపించారు. కృష్ణకాంత్ సాహిత్యాన్నందించారు.హుషారెత్తించే బీట్తో ఈ పాట ఆకట్టుకుంది. కోతా అనే ప్రదేశంలో జరిగే కథ ఇది. గ్యాంగ్స్టర్స్ ఆధిపత్య పోరు నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠను పంచుతుంది. దుల్కార్ సల్మాన్ పూర్తి మాస్ రోల్లో కనిపిస్తారు అని చిత్రబృందం పేర్కొంది. తొలిసారి గ్యాంగ్స్టర్గా నటిస్తుండడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. మలయాళంలో రూపొందుతున్న కింగ్ ఆఫ్ కోటా సినిమా తెలుగు, హిందీ, తమిళంలోనూ విడుదల కానుంది. ఐశ్వర్యలక్ష్మి, నైలా ఉష, చెంబన్ వినోద్, గోకుల్ సురేష్, షమ్మి తిలకన్ తదితరులు చిత్ర తారాగణం.