
హన్సిక ప్రధాన పాత్రలో నటిస్తున్న తమిళ చిత్రం శ్రీగాంధారి. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఆర్.కన్నన్ తెరకెక్కిస్తున్నారు. అదే పేరుతో తెలుగులోకి రానుంది. ఈ చిత్రాన్ని రాజు నాయక్ తెలుగులో విడుదల చేస్తున్నారు. శతాబ్దాల క్రితం ఓ రాజు నిర్మించిన గంధర్వకోటలో ఎన్నో రహస్యాలుంటాయి. వాటిని బయట పెట్టే క్రమంలో జరిగిన సంఘటనలేమిటన్నదే ఈ చిత్ర కథ. ఈ సినిమాలో హిందూ ట్రస్ట్ కమిటీకి హెడ్ ఆఫీసర్‌గా హన్సిక కనిపించనుంది. గంధర్వకోట ప్రాజెక్ట్‌ను చేపట్టిన ఆమెకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యా యన్నది ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుందని మేకర్స్ తెలిపారు. మిస్టరీ, సస్పెన్స్, హారర్‌థ్రిల్లర్‌గా ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని చిత్ర బృందం పేర్కొంది. డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంగీతం: ఎల్వీ గణేష్ ముత్తు, నిర్మాత: రాజు నాయక్, దర్శకత్వం: ఆర్.కన్నన్.
