తేజ సజ్జా ప్రశాంత్ వర్మ కలయికలో రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం హను`మాన్. కె. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. అమృత అయ్యర్ కథానాయిక. వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా ముంబయిలో ఓ కీలక షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో భాగంగా తేజపై అండర్ వాటర్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. సినిమాకు ఎంతో కీలకమైన ఎపిసోడ్ ఇది. చాలా సవాల్‌తో కూడుకుని ఉంటుంది. దీని కోసం తేజ ఊపిరి తీసుకోకుండా నీటిలో ఉండవలసి ఉంటుంది. అందుకే ఈ సీక్వెన్స్ కోసం తనకు హైదరాబాద్‌లో పదిహేను రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇప్పించాం. ఈ ఎపిసోడ్ ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తుంది. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం అని చిత్ర వర్గాలు తెలిపాయి.