తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం హను-మాన్. ప్రశాంత్‌వర్మ దర్శకుడు. కె.నిరంజన్ రెడ్డి నిర్మాత. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రంలో అమృత అయ్యర్, వరలక్ష్మీ శరత్‌కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను తదితరులు నటిస్తు న్నారు. దర్శకుడు మాట్లాడుతూ అంజనాద్రి అనే ఊహాత్మక ప్రపంచంలో ఈ చిత్ర కథ నడుస్తుంది. కథానాయకుడు హనుమంతుడి శక్తులను పొంది అంజనాద్రి కోసం ఎలా పోరాటం చేశాడన్నదే ప్రధాన ఇతివృత్తం. యూనివర్సల్ కాన్సెప్ట్‌తో ప్రతి ఒక్కరిని మెప్పిస్తుంది. హనుమాన్ కోణంలో సాగే సూపర్‌హీరో కథ ఇది. గ్రాఫిక్స్ హంగులతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది. 130 వర్కింగ్‌డేస్‌లో చిత్రీకరణ పూర్తిచేశాం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్నారు. ఈ చిత్రాని తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్ , జపనీస్‌తో సహా పలు భారతీయ భాషలలో పాన్ వరల్డ్ మూవీగా రిలీజ్ కానుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తారు. ఈ చిత్రానికి కెమెరా: దాశరథి శివేంద్ర, సంగీతం: గౌరహరి, అనుదీప్‌దేవ్, కృష్ణసౌరబ్, రచన-దర్శకత్వం: ప్రశాంత్‌వర్మ.
![](https://namastenri.net/wp-content/uploads/2023/04/638bff07-efd2-4cc9-8546-98039833db3c-43.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/04/45af6911-9449-466d-a7e1-ba146800284b-47.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/04/9f49e8d2-8280-46f1-9cd4-82d86a88c854-49-99.jpg)