తేజ సజ్జ అమృతా అయ్యర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం హనుమాన్. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్‌టైనర్‌మెంట్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకుడు. టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా హీరో తేజ సజ్జ మాట్లాడుతూ హనుమంతుడిని మించిన సూపర్ హీరో ఎవరున్నారు? ఆయన గాలి కంటే వేగంగా ప్రయాణిస్తారు. బుద్ది, భుజ బలంలో సాటి లేని వాడు. అలాంటి ఒక యోధుడి నుంచి స్పూర్తి పొంది ఈ చిత్రాన్ని చేశాం. ఆంజనేయుడి అనుగ్రహంతో ఒక యువకుడికి శక్తి వస్తే అతను అలాంటి సాహసాలు చేశాడు. చెడుపై ఎలా పోరాటం చేశాడు అనేది నా పాత్ర ద్వారా చూపిస్తున్నాం. విజువల్ ఫీస్ట్ అనుభూతిని కలిగిస్తుంది అన్నారు.. దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ నా ఇష్ట దైవం హనుమంతుడి మీద సినిమా రూపొందించడం సంతోషంగా ఉంది. ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో రూపొందించమని నిర్మాత ప్రోత్సహించారు. సూపర్ హీరోలకు సూపర్ హీరో హనుమాన్. పురాణాల నుంచి స్ఫూర్తి పొంది చేసిన చిత్రమిది. అంజనాద్రి అనే కొత్త ప్రపంచంలో ఈ కథ సాగుతుంటుంది అన్నారు. ఈ కార్యక్రమంలో అమృతా అయ్యర్, గెటప్ శ్రీనుతోపాటు ఇతర చిత్ర బృందం పాల్గొంది.
