Namaste NRI

హను-మాన్‌ విజయం ప్రేక్షకులదే  : ప్రశాంత్‌ వర్మ

తేజ సజ్జా హీరోగా నటించిన చిత్రం హను-మాన్‌. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం.  ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై కే నిరంజన్‌రెడ్డి నిర్మించారు. సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రానికి చక్కటి ఆదరణ లభిస్తున్నది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌ గ్రాటిట్యూడ్‌ మీట్‌ నిర్వహించింది. దర్శకుడు ప్రశాంత్‌ వర్మ మాట్లాడుతూ నిరంజన్‌ గారి లాంటి నిర్మాత దొరకడం మా అదృష్టం. హను-మాన్‌ విజయం ప్రేక్షకులదే. ఎన్నో క్లోజింగ్‌ థియేటర్స్‌ ఈ సినిమాతో ఓపెన్‌ కావడం ఆనందాన్నిచ్చింది. మూడో వారంలోనూ హౌస్‌ఫుల్‌ బోర్డు చూడటం మేకర్స్‌కి గొప్ప తృప్తినిస్తుంది. ఈ సినిమా ఇంకా చాలా రోజులు ఆడుతుంది. హను-మాన్‌ కు చాలా వేడుకలు చేయనున్నాం.

ఈ సినిమాకు పనిచేసినవాళ్లందరికి గిఫ్ట్స్‌ ఉండబోతున్నాయి. ప్రేక్షకులు హను-మాన్‌ సినిమాను చూస్తూ థియేటర్లను దేవాలయాలుగా భావిస్తున్నారు. సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరూ అయోధ్య ఆలయానికి ఐదు రూపాయలు విరాళం చేస్తున్నారు. ఈ సినిమా లాభాలను దేవుళ్లకు, సినిమాలు తీయడానికే ఖర్చు పెడతాం. ఈ చిత్ర సీక్వెల్‌ జై హనుమాన్‌తో అందరి రుణం తీర్చుకోబోతున్నాను. హను-మాన్‌ కన్నా జై హనుమాన్‌ వంద రెట్లు గొప్పగా ఉంటుంది. ఇంటర్నేషనల్‌ సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నాం అన్నారు. హీరో తేజ మాట్లాడుతూ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు పాదాభివందనం అని అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events