Namaste NRI

ఘనంగా అప్త 16వ వార్షికోత్సవం

అమెరికన్ ప్రొగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (అప్త) 16వ వార్షికోత్సవం వర్జీనియాలోని లీస్‌బర్గ్‌లో డ్రోమవల్లలో ఘనంగా నిర్వహించారు. ముగింపు రోజున శ్రీనివాస కళ్యాణం, ఫ్యాషన్ షో, కోటి సంగీత విభావరి వంటి కార్య క్రమాలను ఏర్పాటు చేశారు. అప్త కు సేవలకు గానూ కోట సుబ్బును సత్కరించారు. నటుడు పృథ్వికి హాస్య నట కేసరి బిరుదును అందజేశారు. బిజినెస్, మాట్రిమోనియల్ సదస్సులో పలువురు పాల్గొన్నారు.

వేడుకలు విజయవంతం అయ్యేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కన్వీనర్ దంగేటి కిషోర్ ధన్యవాదాలు తెలిపారు. బ్యాంక్వెట్ విందులో అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్, డా.ఉదయశంకర్, డా. చక్రరావు, సంగీత దర్శకుడు కోటి, నటుడు పృథ్వీరాజ్, బండి శివశంకర్ రణధీర్, ఆలివ్ స్వీట్స్ దొరరాజు తదితరులను ఆప్త పురస్కారాలతో సత్కరించారు. వేడుకల నిర్వహణను కార్యదర్శి పద్యాల గోపీచంద్, సంస్థ అధ్యక్షుడు ముద్రగెడ త్రినాథ్, ఆప్త కార్యదర్శి నరహరిశెట్టి హిమబిందు, బీఓడీ ఛైర్మన్ సీరం సూర్యనారాయణ తదితరులు పర్యవేక్షించారు.

వేడుకల విజయవంతానికి కార్యదర్శి పద్యాల గోపీచంద్‌, సంస్థ అధ్యక్షుడు ముద్రగెడ త్రినాథ్‌, ఆప్త కార్యదర్శి నరహరిశెట్టి హిమబిందు, బోర్డ్‌ ఛైర్మన్‌ సీరం సూర్యనారాయణ తదితరులు కృషి చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events