Namaste NRI

హ్యాపీ బర్త్‌డే టీజర్‌  విడుదల

లావణ్యా త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం హ్యాపీ బర్త్‌డే. రితేష్‌ రానా దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్‌ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి తాజాగా టీజర్‌ విడుదల చేశారు. టీజర్‌లో యూనియన్‌ మినిస్టర్‌ పాత్రలో వెన్నెల కిశోర్‌ ఇంటికొక గన్‌ అనే బిల్లును ఆమోదించడం, లావణ్యా త్రిపాఠి పోల్‌ డ్యాన్స్‌ వంటివి కనిపిస్తాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి సమర్పణలో చిరంజీవి(చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు. జులై 15న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.  ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ, లైన్‌ ప్రొడ్యూసర్‌: అలేఖ్య పెదమల్లు, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: బాబాసాయి, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: బాల సుబ్రమణ్యం కేవీవీ.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events