Namaste NRI

రాజమౌళిచే హ్యాపీ బర్త్‌డే ట్రైలర్‌

స్టార్‌ హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం హ్యాపీ బర్త్‌డే. నరేష్‌ అగస్త్య, సత్య, వెన్నెల కిషోర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.   తాజాగా ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు రాజమౌళి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చెర్రీకి ఈ సినిమాపై అవగాహన ఉందన్నారు. ఆయన ఏ సంస్థకైనా ఆస్సెట్‌ లాంటి వ్యక్తి అన్నారు. ఈ సినిమా మంచి సక్సెస్‌ను అందించాలన్నారు.  లావణ్యత్రిపాఠి బాగా నటించిందన్నారు.  దర్శకుడు మాట్లాడుతూ నా మొదటి చిత్రం టీమ్‌తోనే మళ్లీ పనిచేశానని అన్నారు. దాని కంటే ఈ సినిమాలో డబుల్‌ఫన్‌, డబుల్‌ యాక్షన్‌, డబుల్‌ థ్రిల్‌ ఉంటుందన్నారు. హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ ఇదొక డిఫరెంట్‌ ఫిల్మ్‌ అని అన్నారు. నిర్మాత కొత్తగా ఆలోచిస్తేనే ఇలాంటి  మూవీ తెరపైకి వస్తుందన్నారు. తాను ఈ తరహా పాత్రలో నటిస్తానని అనుకోలేదన్నారు. నా క్యారెక్టర్‌ కంప్లీట్‌గా కొత్తగా ఉంటుందన్నారు. ఈ చిత్రాన్ని రితేష్‌ రానా రూపొందిస్తున్నారు. క్లాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి నిర్మిస్తోంది. నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి సమర్పణలో చిరంజీవి, హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు.  ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం జులై 8న విడుదల కాబోతోంది. ఈ కార్యక్రమంలో సురేష్‌ సారంగం, రవితేజ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events