Namaste NRI

హ్యాపీ ఎండింగ్ చూడముచ్చటగా ఉంది: అపూర్వ రావు

యష్‌పూరి హీరోగా కౌశిక్‌ భీమిడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం హ్యాపీ ఎండింగ్‌. అపూర్వ రావు కథానాయిక.  ఈ సందర్భంగా అపూర్వ రావు మాట్లాడుతూ మా స్వస్థలం ఒంగోలు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత కొన్ని కార్పొరే ట్‌ కంపెనీస్‌లో జాబ్స్‌ చేశాను. కానీ ఏ ఉద్యోగం నచ్చలేదు. నా మిత్రుల ద్వారా హ్యాపీ ఎండింగ్‌  సినిమా ఆడిషన్స్‌ ఇచ్చే అవకాశం దక్కింది. ఈ సినిమాలో నేను యోగా టీచర్‌ పాత్రలో కనిపిస్తా. ఈ సినిమాలో హీరోకు ఓ శాపం ఉంటుంది. ఆయన ఎవరి గురించి ఆలోచిస్తాడో వాళ్లకు సమస్యలొస్తుంటాయి. అలాంటి అబ్బాయిని అర్థం చేసుకొని అండగా నిలిచే పాత్ర నాది. నా పాత్రకు సొంతంగా డబ్బింగ్‌ చెప్పాను. హీరోకు ఉండే శాపం వల్ల అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. ఈ క్రమంలో పండే కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. నటనలో నేను సాయిపల్లవిని స్ఫూర్తిగా తీసుకుంటా అని చెప్పింది. ఈ చిత్రం  ఫిబ్రవరి 2న విడుదలకానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events