Namaste NRI

భారత్‌కు అమెరికా స్వాతంత్య్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు

యుఎస్‌ఏ స్టేట్‌ సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్‌ భారతదేశ ప్రజలకు 78వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారత్‌ను ఉద్దేశించి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ముఖ్యమైన రోజున, భారతీయ ప్రజల యొక్క గొప్ప చరిత్రను అలాగే అమెరికా, భారత్‌ మధ్య ఉజ్వల భవిష్యత్తును ఘనంగా జరుపుకుందామని, ఈ రెండు దేశాలు సంపన్నమైన, సురక్షితమైన, స్థిరంగా ఉండే ప్రపంచం కోసం కలిసి పని చేస్తున్నాయని తెలిపారు. అలాగే భారత్‌ – యుఎస్‌ల మధ్య బలమైన బంధం ఉందని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఆగస్టు 15న 78వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుం టున్న భారత ప్రజలకు యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా తరపున మేము మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని ప్రకటనలో తెలిపారు.

Social Share Spread Message

Latest News