Namaste NRI

కరుడుగట్టిన కాశ్మీర్‌ క్రిమినల్స్‌ వచ్చేస్తున్నారు

నాగప్రసాద్‌, శివన్య జంటగా నటించిన చిత్రం కాశ్మీర్‌ క్రిమినల్స్‌. ఈ సినిమా ట్రైలర్‌ని దర్శకుడు రాంగోపాల్‌ వర్మ రిలీజ్‌ చేశారు. చిత్ర బృందానికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ పూర్తిగా కాశ్మీర్‌లో చిత్రీకరించాం. ది కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమా తరహాలో ఆసక్తికర స్క్రీన్‌ప్లేతో రూపొందిన మా చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు తుది దశలో ఉన్నాయి. త్వరలో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. షూటింగ్‌ మొత్తం కాశ్మీర్‌లో జరుపుకున్న మొట్టమొదటి తెలుగు చిత్రం కావడం విశేషం.  రావణ లంక ఫేమ్‌ బి.ఎన్‌.ఎస్‌. దర్శకత్వం వహించారు. జీఏ రామారావు, హర్ష ఆరేటి, మోహన్‌ వడ్లపట్ల (యు.ఎస్‌.ఎ) నిర్మించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events