పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. పిరియడికల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాకు జ్యోతి కృష్ణ దర్శకత్వం. రెండు భాగాలుగా వస్తున్న ఈ చిత్రం మొదటి పార్ట్ హరిహర వీరమల్లు పార్ట్: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో ప్రేక్షకుల రాబోతున్నది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.

ఈ సినిమాను మే 09 ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మూవీకి సంబంధించి అప్‌డేట్‌ను పంచుకున్నారు మేకర్స్. ఈ మూవీ పోస్ట్ ప్రోడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. రీ రికార్డింగ్, వీఎఫ్ఎక్స్, డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, మే 09 మాస్ పవన్ కళ్యాణ్ విశ్వరుపం చూడడానికి సిద్ధంగా ఉండడంటూ చిత్రబృందం ప్రకటించింది.
