పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ చిత్రం హరిహర వీరమల్లు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏం.ఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయిక. పదిహేడవ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్‌షాహీల కాలం నాటి కథతో ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నది. ఈ ప్రీ షెడ్యూల్ వర్క్‌షాప్‌లో ముఖ్యమైన సాంకేతిక నిపుణులందరూ పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. ప్రేక్షకులకు ఓ విజువల్‌ఫీస్ట్‌ను అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని, అక్టోబర్ రెండోవారం తర్వాత కొత్త షెడ్యూల్‌ను మొదలు పెడతామని చిత్ర బృందం పేర్కొంది. బాలీవుడ్ యాక్టర్లు అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్, సంగీతం: కీరణవాణి, సంభాషణలు: సాయిమాధవ్ బుర్రా.