పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. నిధి అగర్వాల్ కథానాయిక. జ్యోతి కృష్ణ దర్శకత్వం. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, రెండు పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయని మేకర్స్ చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమాలోని మూడో గీతం కూడా విడుదల కానున్నదని, అలాగే, ట్రైలర్‌ని కూడా విడుదల చేస్తామని, సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చేలా ట్రైలర్ ఉండబోతున్నదని వారు తెలిపారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి సాలిడ్ అప్‌డేట్‌ను ప్రకటించారు మేకర్స్. ఈ మూవీని జున్ 12 ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు మేకర్స్. జూన్ 12న పవన్ కళ్యాణ్ మాస్ విశ్వరుపం చూడడానికి సిద్ధంగా ఉండడంటూ చిత్రబృందం ప్రకటించింది.

ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ, బాబీ డియోల్, అనుపమ్‌ఖేర్, సత్యరాజ్, జిషు సేన్‌గుప్తా, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: మనోజ్ పరమహంస, జ్ఞానశేఖర్ వి.ఎస్, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, సమర్పణ: ఎ.ఎం.రత్నం, నిర్మాణం: మెగా సూర్య ప్రొడక్షన్స్.
