Namaste NRI

హరిహరవీరమల్లు.. వచ్చేది ఆరోజే

పవన్ కళ్యాణ్   హీరోగా నటిస్తున్న చిత్రం హరిహరవీరమల్లు. నిధి అగర్వాల్ కథానాయిక. సోమవారం ఈ సినిమా షూటింగ్ను విజయవాడలో పునఃప్రారంభించినట్లు పేర్కొంది. ఇందులో పవన్ కళ్యాణ్తో పాటు చిత్ర తారాగణమంతా పాల్గొన్నారు. ఈ షెడ్యూల్లో హాలీవుడ్ యాక్షన్ దర్శకుడు నిక్పావెల్ పర్యవేక్షణలో భారీ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు.  కళా దర్శకుడు తోట తరణి నేతృత్వంలో ఓ భారీ సెట్ను తీర్చిదిద్దా రు. 400 మంది ఫైటర్లు, జూనియర్ ఆర్టిస్టులతో పోరాట ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. మొఘల్ సామ్రాజ్య నేపథ్య ఇతివృత్తంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్కల్యాణ్ చారిత్రక యోధుడి పాత్రలో కనిపించను న్నారు. హరిహర వీరమల్లు పార్ట్-1స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ ను వచ్చే ఏడాది మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. బాబీ డియోల్, అనుపమ్ఖేర్, నాజర్, రఘుబాబు తదితరులు నటిస్తున్నారు.  ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, నిర్మాణ సంస్థ: మెగా సూర్య ప్రొడక్షన్స్, నిర్మాత: ఏ.దయాకర్ రావు, సమర్పణ: ఏం.ఎం.రత్నం, దర్శకత్వం: జ్యోతికృష్ణ.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress