Namaste NRI

హరికథ ట్రైలర్‌ విడుదల

దివి, పూజిత పొన్నాడ, రాజేంద్రప్రసాద్‌, శ్రీరామ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్‌ సిరీస్‌ హరికథ. మ్యాగీ దర్శకుడు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా  ట్రైలర్‌ను విడుదల చేశారు. పరుశురాముడు, నరసింహుడు, వామనమూర్తి ఇలా విష్ణువు అవతారల్లో ఊరిలో నేరస్తులను శిక్షిస్తుంటాడో అపరిచిత వ్యక్తి. ఇంతకి అతనెవరు? ఆ హత్యలు ఎందుకు చేస్తుంటాడు? అనే కోణంలో పోలీసు ల పరిశోధన మొదలవుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్‌లో పోలీస్‌ అధికారులకు ఎదురైన సంఘటనలు ఏమిటి? అనే అంశాల్ని ట్రైలర్‌లో ఆసక్తికరంగా చూపించారు. పౌరాణిక టచ్‌తో ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా సాగింది. డిసెంబర్‌ 13 నుంచి డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ వెబ్‌ సిరీస్‌కు కెమెరా: విజయ్‌ ఉలగనాథ్‌, సంగీతం: సురేష్‌ బొబ్బిలి, దర్శకత్వం: మ్యాగీ.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events