హరీష్ కల్యాణ్, అతుల్య రవి జంటగా నటిస్తున్న సినిమా డీజిల్. థర్డ్ ఈవ్ ఎంటర్టైన్మెంట్, ఎస్పీ సినిమాస్ పతాకంపై ఎం దేవరాజులు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ కథతో దర్శకుడు షణ్ముగం ముత్తుసామి రూపొందిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో రూపొందుతోంది. ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లును విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ఇదొక చక్కటి రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం అన్నారు. సాయికుమార్, కరుణాస్, వినయ్ రాయ్ అనన్య, అరుణ్ పాండియన్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ధిబు నినన్ థామస్, ఛాయాగ్రహణం: ఎంఎస్ ప్రభు.