చైతన్యరావ్, లావణ్య జంటగా నటిస్తున్న చిత్రం అన్నపూర్ణ ఫొటో స్టూడియో. ఇచ్చట అందంగా ఫొటోలు తీయబడును అనేది ఉపశీర్షిక. ఈ చిత్రానికి చెందు ముద్దు దర్శకుడు. ఈ చిత్ర టైటిల్, కాన్సెప్ట్ పోస్టర్‌ను తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ విడుదల చేశారు. చిత్ర విశేషాలను నిర్మాత తెలియజేస్తూ గ్రామీణ నేపథ్యంగా సాగే క్రైమ్ కామెడీ చిత్రమిది. 80వ దశకం నేపథ్యంలో కథ కొనసాగుతుంది. కొత్త తరహా చిత్రాలను కోరుకునే ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచే చిత్రమిది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రిన్స్ హెన్రీ.