Skip to main content

Namaste NRI

హరోం హర సెకండ్‌ సింగిల్‌..కనులెందుకో కలిసేనులే

సుధీర్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం హరోం హర. ది రివోల్ట్‌ ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్‌ దర్శకత్వం.  శ్రీసుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్‌ పతాకంపై సుమంత్‌ జి నాయుడు నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాటల ప్రమోషన్‌ను వేగవంతం చేశారు. ఈ సినిమాలోని సెకండ్‌ సింగిల్‌ కనులెందుకో కలిసే నులే విడుదలైంది. చైతన్‌ భరద్వాజ్‌ ఈ పాటను స్వరపరచడంతో పాటు నిఖితా శ్రీవల్లితో కలిసి ఆలపిం చారు. మెలోడీ ప్రధానంగా సాగిన ఈ పాటలో సుధీర్‌బాబు, మాళవిక శర్మ కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉంది. చిత్తూరు జిల్లా కుప్పంలో 1989లో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా తీశానని దర్శకుడు తెలిపారు. చిత్రీకరణ పూర్తయింది. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి కెమెరా: అరవింద్‌ విశ్వనాథన్‌, సంగీతం: చైతన్‌ భరద్వాజ్‌, నిర్మాత: సుమంత్‌ జి నాయుడు, రచన-దర్శకత్వం: జ్ఞానసాగర్‌ ద్వారక.

Social Share Spread Message

Latest News