సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం సోదరా. మోహన్ మేనంపల్లి దర్శకుడు. సంజోష్, ప్రాచీబంసాల్, ఆరతి గుప్తా ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ట్రైలర్‌ను దర్శకుడు సాయిరాజేష్, నిర్మాత ఎస్‌కేఎన్ ఆవిష్కరించారు. సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ అప్‌డేట్ అయిన తమ్ముడు, అమాయకుడైన అన్న మధ్య జరిగే స్వచ్ఛమైన కథ ఇది. నా రియల్‌లైఫ్ క్యారెక్టర్ ఈ సినిమాలో కనిపిస్తుంది అన్నారు.

సంపూర్ణేష్‌బాబుతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని, సంపాదించిన డబ్బుతో అందరికి సహాయం చేస్తుంటాడని, ఆయన నిజమైన స్టార్ అని సాయిరాజేష్ అన్నారు. ఒక షో బుక్ చేసి మిత్రులందరికి ఈ సినిమా చూపిస్తానని ఎస్‌కేఎన్ తెలిపారు. అన్నదమ్ముల అనుబంధం విలువ చెప్పే చిత్రమిదని హీరో సంజోష్ పేర్కొన్నారు. ఈ నెల 25న విడుదలకానుంది.
