ఉపేంద్ర హీరో గా నటిస్తున్న చిత్రం కబ్జ. ఆర్ చంద్రు స్వీయ దర్శకత్వంలో రూపొందించారు. ఈ చిత్రంలో శ్రియా సరన్, కిచ్చా సుదీప్, శివరాజ్ కుమార్, జగపతి బాబు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హీరో ఉపేంద్ర మాట్లాడుతూ విజువల్ గ్రాండియర్ మూవీ ఇది. రెండు, మూడేండ్లుగా ఈ సినిమాకు పనిచేస్తున్నాం. ఈ సినిమాను ఇంత బాగా రూపొందించిన ఘనత దర్శకుడు చంద్రూకే దక్కుతుంది. ఆయన కల ఈ సినిమా. కరోనా సమయంలోనూ ఎన్నో శ్రమలకోర్చి సినిమాను పూర్తి చేశారు. నా ఉపేంద్ర సినిమాను ప్రేక్షకులు మర్చిపోలేరు. అలాంటి చిత్రం కావాలని ఎదురుచూస్తుంటారు. త్వరలోనే యూఐ చిత్రంతో మీ ముందుకొస్తాను అన్నారు.
నాయిక శ్రియా సరన్ మాట్లాడుతూ తెలుగు సినిమా నాకెప్పుడూ ప్రత్యేకమే. నటిగా నేను ఎదిగింది ఇక్కడే. ఉపేంద్రతో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఆయనను కొత్త కోణంలో చూపించే చిత్రమిది అని చెప్పింది. నిర్మాత లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఉపేంద్ర నటించిన బుద్ధిమంతుడు చిత్రాన్ని తెలుగులో నేనే విడుదల చేశాను. మళ్లీ ఆయన కబ్జా చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నా. తెలుగులో కేజీఎఫ్, కాంతార సినిమాలు ఘన విజయాలు సాధించాయి. మా సినిమా కూడా అదే స్థాయి విజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నాం అన్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్. సుధాకర్ రెడ్డి సమర్పణలో రుచిరా ఎంటర్టైన్మెంట్స్, ఎన్ సినిమాస్ సంస్థలు ఈ నెల 17న విడుదల చేస్తున్నాయి.